NET-NEET Paper Leak : నెట్-నీట్లో అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్న కాంగ్రెస్
- నీట్ అవకతవకలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
- నేరస్తులను విడిచి పెట్టబోమన్న మంత్రి ధర్మేంద్రప్రధాన్
- యువత భవిష్యత్ బీజేపీ నాశనం చేస్తుందన్న రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NET-NEET Paper Leak : మొదట నీట్, ఆ తర్వాత నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నిరంతరం దాడి చేస్తోంది. ఈ విషయమై నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టనున్నారు. మధ్యప్రదేశ్‌లో నీట్, నర్సింగ్ స్కాం, వివిధ పరీక్షల్లో పేపర్ లీక్‌కు సంబంధించి భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టనుంది. ఈ ప్రదర్శనలో దిగ్విజయ్ సింగ్, జితూ పట్వారీ సహా పలువురు నేతలు పాల్గొంటారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయి.
పేపర్ లీక్ వ్యవహారం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిన్న అంటే గురువారం మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశంలో పేపర్లు నిరంతరం లీక్ అవుతున్నాయని, నరేంద్ర మోడీ దానిని ఆపలేకపోతున్నారని రాహుల్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు, విద్యా మాఫియాల ప్రయోగశాలలకు కేంద్రంగా మారాయి. విద్యావ్యవస్థను నాశనం చేస్తూ యువత భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. ఇండియా కూటమి దీన్ని ఎప్పటికీ అనుమతించదని హెచ్చరించారు.
Also Read
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
Read Also:Dharmendra Pradhan: పేపర్ లీక్ ఎఫెక్ట్.. యోగా దినోత్సవ ప్రోగ్రామ్ రద్దు చేసిన కేంద్ర విద్యామంత్రి
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపేస్తారని, అయితే పేపర్ లీక్‌ను ఆపలేకపోతున్నారని లేదా ఆపాలని కోరుకోవడం లేదని ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు చెందిన వ్యక్తులు విద్యాసంస్థలను స్వాధీనం చేసుకున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారితే తప్ప పేపర్ లీకేజీ ఆగదు.
దీనికి నేను బాధ్యత వహిస్తాను – ధర్మేంద్ర ప్రధాన్
పేపర్ లీక్ అంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తు అని అన్నారు. విద్యార్థుల సంక్షేమమే మా ప్రాధాన్యత. ఇందులో ఎలాంటి రాజీ ఉండదు. ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినా ఆరా తీస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఈ విషయంలో నైతిక బాధ్యత వహిస్తాను. నేరస్తులను వదలబోమని మంత్రి తెలిపారు.
Read Also:Dharmendra Pradhan: పేపర్ లీక్ ఎఫెక్ట్.. యోగా దినోత్సవ ప్రోగ్రామ్ రద్దు చేసిన కేంద్ర విద్యామంత్రి
- Tags
- congress
- NEET
- NET
- Paper Leaks
- protest
తాజావార్తలు
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!