Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal PM Balendra Shah: నేపాల్ ప్రధాని బలేంద్ర షా (బాలెన్ షా) నవంబర్ నెలలో భారత్లో పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ప్రధానిగా మార్చిలో బాధ్యతలు చేపట్టిన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ పర్యటన జరుగుతుండటం విశేషం. నవంబర్ మూడో లేదా నాలుగో వారంలో జరగబోయే ఈ మూడు రోజుల పర్యటనే ప్రధానిగా ఆయనకు మొదటి అధికారిక విదేశీ ద్వైపాక్షిక పర్యటన కానుంది. అంతకుముందు సెప్టెంబర్లో ఆయన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (UNGA) కోసం అమెరికా వెళ్లినప్పటికీ, అది ద్వైపాక్షిక పర్యటన కాదు. అక్కడ మాట్లాడిన ఆయన, లొసుగులతో కూడిన వ్యవస్థల వల్ల నేపాల్, బంగ్లాదేశ్, భారత్ వంటి దక్షణాసియా దేశాలకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో నొక్కిచెప్పారు.
ది ఖాట్మండు పోస్ట్ కథనం ప్రకారం.. బలేన్ షా భారత పర్యటనలో భారీ ఎజెండా ఉండబోతోంది. కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సరిహద్దు వివాదాల నుంచి వరద పునరుద్ధరణ పనుల వరకు అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రారంభంలో విదేశీ దౌత్యవేత్తలను, ముఖ్యంగా భారత్, చైనా ప్రతినిధులను కలవడానికి పెద్దగా ఆసక్తి చూపని బలేన్ షా, ఇప్పుడు భారత్కు రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా ఆగస్టులో నేపాల్లో వచ్చిన భయంకరమైన వరదల సమయంలో భారత్ తక్షణమే స్పందించి సహాయ సామాగ్రిని, రెస్క్యూ నిపుణులను పంపింది. ప్రస్తుతం పర్యటనకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నప్పటికీ, ఖాట్మండు గానీ, న్యూఢిల్లీ గానీ పర్యటన తేదీలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
Also Read
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
జూన్ నెలలో నేపాల్ అధికారంలో ఉన్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) అధ్యక్షుడు రబీ లామిఛానే న్యూఢిల్లీలో పర్యటించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది, అలాగే పలువురు సీనియర్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. దౌత్యపరమైన సమావేశాలకు బలేన్ షా దూరంగా ఉంటున్న సమయంలో రబీ లామిఛానే పర్యటన అందరి దృష్టినీ ఆకర్షించింది. నేపాల్ ప్రధానికి ఒక రాజకీయ సందేశం పంపడానికే లామిఛానేకు అంత పెద్దపీట వేశారని సీనియర్ నేపాల్ జర్నలిస్ట్ కేశవ్ ప్రధాన్ ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారు.
ఇక, అక్టోబర్ 15న ది ఖాట్మండు పోస్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ పర్యటన సమయంలో ప్రారంభించదగిన లేదా శంకుస్థాపన చేయదగిన ప్రాజెక్టుల జాబితాలను ఇరుదేశాల అధికారులు ఇప్పటికే మార్పిడి చేసుకున్నారు. బలేన్ షా భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. కొన్ని ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలపై (MoUs) చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. కాట్మండుకు ఆగ్నేయంలో ఉన్న పనౌతీలో భారత్ నిధులతో నిర్మించిన ‘నేపాల్ పోలీస్ అకాడమీ’, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని సునౌలీ దగ్గర ఉన్న భైరహవా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (దీనికి జూన్ 2023లో శంకుస్థాపన జరిగింది), దార్చులా జిల్లాలోని వారధులు, అలాగే మహాకాళి నదిపై వంతెనల ప్రారంభోత్సవాలు ఈ పర్యటనలో ఉండే అవకాశముంది. వీటితో పాటు దొధారా చాందని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, లోయర్ అరుణ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్, సిలిగురి-ఝాపా పెట్రోలియం పైప్లైన్ నిర్మాణ పనులకు ప్రధానులిద్దరూ శ్రీకారం చుట్టే అవకాశముంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!