Hydra: హైడ్రా బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో కేటాయించింది ప్రభుత్వం. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో…
HYDRA : తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఈ ప్రక్రియ ద్వారా అక్రమ కబ్జాలపై బుద్ధి చూపిస్తుంది. గత కొన్ని నెలల్లో, చెరువులపై కబ్జాలు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవడంతో, వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా, నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. అయితే శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా…
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు.