Paris Olympics: నీరజ్ చోప్రా వీరాభిమాని.. రెండేళ్లలో సైకిల్‌పై 30 దేశాలు దాటి పారిస్ కు
- దాదాపు రెండేళ్లుగా సైకిల్ యాత్ర
- రళ నుంచి ఫ్రాన్స్ రాజధానికి చేరుకున్న నీరజ్ చోప్రా వీరాభిమాని
- 15 ఆగస్టు 2022న యాత్రం ప్రారంభం
- పారిస్ ఒలింపిక్స్ కు ఆహ్వానించిన నీరజ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు రెండేళ్లుగా సైకిల్ పై కేరళ నుంచి ఫ్రాన్స్ రాజధానికి చేరుకున్నాడు ఓ అభిమాని. భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాకు ఈ యువకుడు వీరాభిమాని. ఈయన పేరు ఫైస్ అస్రఫ్ అలీ.. 15 ఆగస్టు 2022న కేరళలోని కాలికట్ నుంచి పారిస్ వరకు సైక్లింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. దాదాపు 22,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 30 దేశాలు పర్యటించి పారిస్ చేరుకున్నాడు. అలీ ‘శాంతి,ఐక్యత’ సందేశంతో భారతదేశం నుంచి లండన్‌కు సైక్లింగ్ మిషన్‌కు బయలుదేరాడు.
READ MORE: Srisailam Dam Gates Lifted: పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్ మరో రెండు గేట్లు ఎత్తివేత..
Also Read
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ఈ క్రమంలో 17 దేశాల్లో సైకిల్ తొక్కిన అనంతరం గతేడాది ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం బుడాపెస్ట్ లో ఆగినప్పుడు నీరజ్ అక్కడే ఉంటున్నట్లు తెలిసింది. అలీ కేరళకు చెందిన ప్రముఖ కోచ్‌కి ఫోన్ చేసి భారత జట్టును కలవాలని కోరాడు. అప్పుడే అలీకి నీరజ్‌ను కలిసే అవకాశం వచ్చింది. లండన్ వెళ్తున్నప్పుడు ఒలింపిక్స్ కోసం పారిస్ ఎందుకు రాకూడదని నీరజ్.. అలీని అడిగాడు. ప్లేయస్ ఆహ్వానం మేరకు అలీ తన ప్లాన్‌ని కాస్త మార్చుకుని పారిస్ వెళ్లేందుకు అవసరమైన వీసా సంపాదించాడు.
READ MORE: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు!
నీరజ్‌ని పారిస్‌కు ఆహ్వానించారు..
‘ఇండియా హౌస్’లో తన పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఫైస్ అస్రఫ్ అలీ మాట్లాడుతూ.. “భారత అథ్లెట్లతో మాట్లాడటానికి నాకు కొన్ని నిమిషాలు సమయం దొరికింది. పారిస్ ఒలింపిక్స్ కి రామ్మని నీరజ్ నన్ను ఆహ్వానించాడు. ఆయన్ను మళ్లీ పారిస్‌లో కలవడం గొప్ప అవకాశంగా భావించాను. కాబట్టి నేను నా ప్రణాళికలను కొంచెం మార్చుకున్నాను. అవసరమైన వీసాను పొందాను. అతను మళ్లీ చరిత్ర సృష్టించడం చూడటానికి నేను వచ్చాను. ” అని పేర్కొన్నాడు.
READ MORE: Telangana Assembly: నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు.. సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి..
అలీ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ ఏ హోటల్‌లోనూ ఉండను. మధ్యమధ్యలో వీసా ఏర్పాటు చేసుకోవడానికి రెండు సార్లు కేరళ వెళ్లాల్సి వచ్చింది. సరిహద్దు దాటడానికి మాకు వీసా మాత్రమే అవసరం. సైక్లిస్ట్‌కు ఇతర పత్రాలు ఏవీ అవసరం లేదు.’ అని తెలిపాడు. ఈ కాలంలో అలసట లేదా ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యను ఎదుర్కొన్నారా అని అలీని అడిగినప్పుడు.. అలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదని చెప్పాడు.
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!