Gold and Silver Rates Decreased in Hyderabad on 30 July 2024: మగువలకు శుభవార్త అనే చెప్పాలి. గత మూడు రోజుల్లో రెండుసార్లు పెరిగిన బంగారం ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జూన్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గి.. రూ.63,200లుగా ఉంది. 24 క్యారెట్లపై రూ.210 తగ్గి.. రూ.68,950గా నమోదైంది. రెండు వారాల క్రితం ఆల్‌టైమ్ హైకి చేరుకున్న పసిడి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుదలకు తోడు బడ్జెట్ 2024లో కస్టమ్స్ సుంకం తగ్గించడంతో భారీగా పడిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,200లుగా ఉండగా.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,950గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,350 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.69,100గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.68,950గా నమోదైంది. చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల ధర రూ.63,850గా.. 24 క్యారెట్ల ధర రూ.69,650గా కొనసాగుతోంది.
Also Read: Asia Cup 2025-India: 34 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం.. టీ20 ఫార్మాట్‌లో టోర్నీ!
మరోవైపు ఇటీవలి రోజుల్లో వరుసగా తగ్గుతూ వచ్చిన వెండి ధర నిన్న రూ.500 పెరగా.. నేడు అంతే తగ్గింది. మంగళవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.84,500గా ఉంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.89,000గా నమోదైంది. ఇటీవలి రోజుల్లో కిలో వెండి ధర లక్ష దాటిన విషయం తెలిసిందే.