Prithviraj Sukumaran: ప్రభాస్ గురించి అసలు నిజం బయటపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాష తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరో ప్రభాస్. హీరోగా కంటే తన మంచితనం తో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ప్రజంట్ కెరీర్ పరంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్‌కు బయటనే కాకుండా సోషల్ మీడియాలో కొన్ని మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ తను మాత్రం కేవలం సినిమాకు సంబంధించిన విషయాలపైనే అప్డేట్లు మత్రమే ఇస్తూంటాడు. తన వ్యాక్తిగత విషయాలు రేర్‌గా పంచుకుంటుంటారు. అయితే తాజాగా ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ గురించి ఓ సీక్రెట్‌ను మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రివీల్ చేశారు.. ఇంతకి ఏంటా విషయం అంటే..
Also Read: Allu Aravind : దేవి శ్రీ ప్రసాద్‌ని వద్దు అనడానికి కారణం ఇదే : అల్లు అరవింద్
Also Read
- Jayasudha: ‘మీరు - నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
- Kiran Abbavaram : వెనక్కి తగ్గిన '#HATAH'.. అందుకేనని ప్రకటన
- OM : టాలీవుడ్ పై 'ఓం' దండయాత్రకి సితార సపోర్ట్!
- Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
ప్రజంట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్2’ మూవీలో బిజీగా ఉన్నారు. మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు ‘లూసిఫర్ 2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’ పేరిట ప్రీక్వెల్ కమ్ సీక్వెల్‌ను రూపొందించారు. ఈ మూవీ మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీరాజ్ ప్రభాస్ సీక్రెట్ ఒకటి రివీల్ చేశాడు..
పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. ‘ ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ ఉంటాడు. స్టార్డమ్ గురించి అసలు ఆలోచించరు. సోషల్ మీడియాపై ఆసక్తి ఉండదు. ఇక ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్ స్టా నుంచి వచ్చే పోస్ట్‌లు కూడా షేర్ చేసేది ఆయన కాదు. ఈ మాట చెప్పి మీమల్ని నిరాశ పరిచినందుకు క్షమించండి. అతనికి చిన్న చిన్న ఆనందాలంటే ఇష్టం. ఫామ్ హౌస్ లో సంతోషంగా ఉంటాడు. ఎక్కడైనా మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దాం అని అడుగుతుంటారు. ప్రభాస్‌ని చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోతాను’అని తెలిపాడు. అలాగే రాజమౌళి గురించి కూడా మాట్లాడుతూ..‘ ‘బాహుబలి’ సినిమాకు ముందు కొన్ని సినిమాల సీక్వెల్స్ వచ్చినప్పటికీ ‘బాహుబలి 2’ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ఇటీవల వచ్చిన ‘పుష్ప 2’ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇక అలాగే త్వరలో ‘సలార్2’ కూడా రానుంది రెడీగా ఉండండి’ అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు పృథ్వీ రాజ్. ప్రజంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Jagtial Adoption Case : జగిత్యాల బాలుడి దత్తత కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు కలెక్టర్
-
Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
-
Reasons Behind Republican Defeat: ఇరాన్ వార్ నుంచి అభ్యర్థుల ఫెయిల్యూర్ దాకా.. ట్రంప్ పార్టీ ఓటమికి అసలు కారణాలివే!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Food Safety Raids : మిఠాయిల్లో బొద్దింకలు, ఈగలు.. నిజామాబాద్‌లో 13 సంస్థల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!