కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ రోజు నుంచే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
అర్హతలు:
టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్ఎం/డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు..
ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలంటే?
• ముందుగా ఈ లింక్ తో అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి
• హోం పేజీలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయండి.
• నోటిఫికేషన్ కింద Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయండి.
• అనంతరం అప్లికేషన్ ఫామ్ లో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి.
• ఫామ్ పూర్తిగా నింపిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
• అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు మంచి స్పందన రావడంతో ఈ ఏడాది కూడా అభ్యర్థుల సంఖ్యను పెంచినట్లు తెలుస్తుంది .. మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..