NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీరసింహారెడ్డి’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టిగా ప్లాన్ చేసింది. కానీ ఈ డేట్ ను అందుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోందని టాక్.
షూటింగ్ పరంగా ఇంకా భారీ వర్క్ బ్యాలెన్స్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఇంకా దాదాపు 45 రోజుల షూటింగ్ మిగిలి ఉందట. అక్టోబర్ నాటికి సినిమాను సిద్ధం చేయాలంటే పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులతో కలిపి టైమ్ చాలా తక్కువగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న దర్శకుడు గోపీచంద్ షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కాస్త గట్టిగానే కష్టపడుతున్నారు. దీంతో దసరా రేస్ నుండి ఈ సినిమా తప్పుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రత్యామ్నాయ విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి చిత్ర యూనిట్ చూపు డిసెంబర్ 4 రిలీజ్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సమయానికి కూడా పనులు పూర్తి కాకపోతే బాలయ్యకు బాగా కలిసి వచ్చిన సీజన్ అయిన సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ కూడా సంక్రాంతికే వచ్చి ఘనవిజయం సాధించడంతో ఆ డేట్ ను కూడా చూస్తున్నారు. కానీ ఎప్పుడు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!