Vijay Deverakonda: మొన్న క్రికెట్ ఇప్పుడు వాలీ బాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రీడారంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఇప్పటివరకు క్రికెట్, కబడ్డీ వంటి ఆటలకే పరిమితమైన క్రేజ్, ఇప్పుడు వాలీబాల్ వైపు మళ్లింది. ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (AVC) మెన్స్ కప్‌లో భారత వాలీబాల్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. తొలిసారిగా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని మూడో స్థానంలో నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా వాలీబాల్ ఆటకు సరికొత్త ఊపును తీసుకురావడమే కాకుండా, క్రీడాకారుల్లో సరికొత్త నమ్మకాన్ని నింపింది. అయితే, భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయం వెనుక గత నాలుగేళ్లుగా సాగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్’ కృషి ఎంతో ఉన్నాయని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా వాలీబాల్ క్రేజ్ పెంచడంలో 10 నగరాల ఫ్రాంఛైజీలు కీలక పాత్ర పోషిస్తుండగా.. అందులో హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ అత్యంత కీలకమైన జట్టుగా దూసుకుపోతోంది. ఈ ఫ్రాంఛైజీకి కో-ఓనర్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా వాలీబాల్ ప్లేయర్లకు కొండంత అండగా నిలుస్తున్నారు. “మన వాలీబాల్ ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తారని, దేశానికి మంచి పేరు తెస్తారనే నమ్మకంతోనే ఈ ఫ్రాంఛైజీ బాధ్యతలు తీసుకున్నాను” అని విజయ్ దేవరకొండ గతంలోనే ప్రకటించారు. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ నేడు భారత జట్టు ఆసియా వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
>
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, క్రీడారంగాన్ని ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటున్నారు. ప్రస్తుతం ఒకవైపు టీజీ 20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ లోకల్ క్రికెట్ టాలెంట్‌ను వెలికితీస్తూనే.. మరోవైపు ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ ద్వారా వాలీబాల్ క్రీడాకారుల ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తున్నారు. సినిమాల్లో కొత్త టాలెంట్‌ను, నూతన దర్శకులను ప్రోత్సహించే విజయ్.. ఆటల్లోనూ యువ క్రీడాకారులకు బలమైన సపోర్ట్‌గా నిలుస్తూ ‘రియల్ హీరో’ అనిపించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!