Nayanthara : ఆసక్తికర పోస్ట్ చేసిన లేడీ సూపర్ స్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా నయనతార మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనదైన నటనతో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.ప్రస్తుతం ఈ భామ కెరీర్ ఫుల్ జోషలో ఉంది. ఆమె బాలీవుడ్‌లో తొలిసారిగా నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది.షారుక్ ఖాన్ హీరో గా నటించిన జవాన్ మూవీ ఈ ఇప్పటికే రూ. 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. జవాన్ మూవీ ఊపు చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జవాన్ లో నర్మద అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది నయనతార. తన గ్లామర్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అదరగొట్టిందీ ఈ భామ . ప్రస్తుతం జవాన్ సక్సెస్ ఫుల్ హ్యాపీ గా ఉన్న నయన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన భర్త విఘ్నేశ్ శివన్ ధరించిన టీ షర్ట్‌పై ‘మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి..’ అని రాసి ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నయనతార పోస్ట్‌కు అర్థం ఏమై ఉంటుంది అని అభిమానులు, నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు.
అయితే గతేడాది విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోవడం అలాగే ఇద్దరి పిల్లలకు తల్లి కావడం రీసెంట్ గా బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ తో ఎంట్రీ ఇవ్వడం వంటివి నయన్ లైఫ్‌లో అన్నీ మంచి శకునాలే కనిపిస్తూ ఉన్నాయని..అందుకే ఆమె అలాంటి పోస్ట్ పెట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇదిలా ఉంటే సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషకం అందుకుంటోన్న హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 8-10 కోట్లు తీసుకుంటోందని తెలుస్తోంది. ఇక ‘జవాన్’ చిత్రానికి నయన్ ఏకంగా రూ.11 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. జవాన్ సినిమా సక్సెస్ తర్వాత తన పారితోషికాన్ని మరింతగా పెంచేసిందని తెలుస్తోంది. అలాగే భారీ బడ్జెట్ ల నిర్మాతలు నయనతార కాల్షీట్స్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..జవాన్ సినిమా తర్వాత నయన్ ఇరైవన్ అనే సినిమాలో నటిస్తోంది జయం రవి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు ‘లేడీ సూపర్ స్టార్ 75 ‘ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మరో మూవీలో కూడా నటిస్తుంది
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
తాజావార్తలు
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి