Pakistan: ప్రధాని బాధ్యతలపై నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పీఎంగా అతడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
nawaz sharif: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ఆయన నామినేట్ చేశారు. దీంతో షహబాజ్ మరోసారి పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నాలుగోసారి పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ పదవి బాధ్యతలు తీసుకుంటారని అందరు అనుకున్నారు.. కానీ, ఈ షాకింగ్ నిర్ణయం వెల్లడించారు.
Read Also: Rajadhani Files: ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలను ఆపండి..! హైకోర్టులో పిటిషన్
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
కాగా, నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పీఎంఎల్-ఎన్ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు తెలియజేశారు. అలాగే, నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ ను పంజాబ్ ప్రావిన్స్ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. పీఎంఎల్-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సపోర్టు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్ ధన్యవాదాలు చెప్పారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Medaram Bus Tickets: మేడారం జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఎంతో తెలుసా?
ఇక, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో చర్చలు చేశారు. ఈ క్రమంలో నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని అందరు అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయన తన తమ్ముడి పేరుని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 265 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో విజయం సాధించాగా.. పీఎంఎల్-ఎన్ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలిచింది.
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!