గీతంలో దళితుల రచనలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. గీతం స్కూల్ ఆఫ్ మానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎసిహెచ్ఎస్) ఆధ్వర్యంలో ‘వ్యవహారిక పత్రికలు, రచనలు, వెలువరించడంలోని సాధక బాధకాలు’ అనే అంశంపై మార్చి 1-3 తేదీలలో జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. మెస్తూర్లోని భారతీయ భాషల కేంద్ర సంస్థ దళిత సాహిత్యాన్ని రాయడం, విశ్లేషించడం, ఎవదించడాన్ని సమన్వయం చేస్తున్న సంస్థల (కళలు, మానవీయ శాస్త్రాల పరిశోధనా మండలి, నాటింగ్డమ్ -పాల్ వారెరీ విశ్వవిద్యాలయాల) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్టు సదస్సు సమన్వయకర్త డాక్టర్ శాంతన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
దళిత సాహిత్యం ప్రపంచం దృష్టికి రావడానికి, వర్ణ, జాతిపై విభిన్న సామాజిక-రాజకీయ చర్చలను ప్రసారం చేసిన వివిధ భారతీయ భాషా పత్రికలతో పనిచేసేవారు, పరిశోధక విద్యార్థులు, బోధకులను ఈ సదస్సు వివిధ కులాలు, భాషల మధ్య జరుగుతున్న సంభాషణలు, ఆలోచనల మార్పిడి, స్వీయ శోధన, ఆత్మ ఆహ్వానిస్తోందన్నారు. దళిత సాహిత్యం పరిశీలనను ఈ సదస్సు ప్రోత్సహిస్తున్నట్టు డాక్టర్ శాంతన్ చెప్పారు. పత్రికా పరిశ్రమ, దేశీయ పత్రికలు, భాష, జాతి : జాతీయత, కులం, జానపద కళా ప్రక్రియలు వంటి అంశాలని ఔత్సాహికులు పత్ర సమర్పణ చేయొచ్చన్నారు..
ప్రొఫెసర్ టి.ఎం.యేసుదాసన్, జేనీ పవార్, కళ్యాణి ఠాకూర్ చరల్, నకుల్ మాలిక్, ప్రొఫెసర్ రేఖా మెష్రమ్| ప్రొఫెసర్ జె.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ రాజ్ కుమార్ హన్స్, హరీష్, మంగళం, ప్రొఫెసర్ సిప్రా ముఖర్జీ, ప్రొఫెసర్ .పి. తిరుమల్, ప్రొఫెసర్ సౌమ్య రేవమ్మ వంటి ప్రముఖ వక్తలు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు, తమ పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం డాక్టర్ జోంధాలే రాహుల్ హిరామన్ thiraman@gitam edu/ smondali@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.