నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా విడిపోయారు. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగారు. విడాకుల తర్వాత నటాషా తన మొదటి ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేసింది. ఇటీవలే ఆమె మ్యూజిక్ వీడియో ‘తేరే కర్కే’ ప్రారంభించబడింది. అదే సమయంలో హార్దిక్ కూడా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్టోబర్ 11న హార్దిక్ తన 31వ పుట్టినరోజును జరుపుకున్నాడు. హార్దిక్, నటాషా కొన్ని గంటల క్రితం తమ తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు. హార్దిక్ తన బర్త్ డే కేక్ కట్ చేస్తుండగా.. నటాషా ఎల్విష్ యాదవ్‌తో కలిసి రీల్ చేస్తూ కనిపించింది.
READ MORE: US-Syria: సిరియాపై అమెరికా బాంబుల వర్షం.. ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా భీకరదాడి
నటాషా స్టాంకోవిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్విష్ యాదవ్‌తో రొమాంటిక్ రీల్ చేసింది. ఈ రీల్‌లో ఆమె సిగ్గుపడుతున్నట్లు కనిపిస్తుంది. తన స్వంత మ్యూజిక్ వీడియో ‘తేరే కర్కే’లో ఈ రీల్‌ను రూపొందించారు. దీన్ని పోస్ట్ చేసిన యాదవ్.. ఈ వీడియోతో పాటు.. జీవితంలో ముందుకు సాగడానికి సంబంధించిన క్యాప్షన్‌లో “ఒక సరికొత్త స్థాయిలో సజీవత్వం.” అని రాసుకొచ్చాడు.
READ MORE:Kakinada: చందాకి వచ్చి మహిళపై మత్తు మందు చల్లి సొమ్ము చోరీ
ఇదిలా ఉండగా.. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న హార్దిక్ పాండ్యా తన మొదటి పుట్టినరోజును జరుపుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫొటోలను షేర్ చేశాడు. ఈ చిత్రాలలో కేక్ కట్ చేస్తూ కనిపించాడు. జీవితంలో సానుకూలతతో ముందుకు సాగాలని హార్దిక్ ఉత్సాహం వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా క్యాప్షన్‌లో “ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో నిండి ఉంది. కానీ సానుకూలత, ఆశయంతో ముందుకు సాగడానికి ఇదే సమయం. నేను పొందిన అన్ని ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞుడను. నా తప్పుల నుంచి నేను చాలా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు శుభాకాంక్షలకు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. నేను ఈ కొత్త సంవత్సరంలో కొత్త స్ఫూర్తితో.. చాలా ప్రేమతో ముందుకు సాగుతున్నాను.” అని రాశాడు.