Bus Accident: మనిషికి మృత్యువు ఏ రూపంలో దూసుకొస్తుందో చెప్పలేం. సోషల్ మీడియా పుణ్యమాని ఇటీవల ఉన్నట్లుండి చనిపోయిన వారి వీడియోలు చూస్తునే ఉన్నాం. మాట్లాడుతూనే ఉంటారు అంతలోనే అనంత లోకాలకు పయనమవుతారు. సో.. ప్రమాదం ఏ రూపంలో వచ్చిన ముందస్తుగా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు చేసేటప్పుడు మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఒక్కోసారి మనం కరెక్ట్ గా ఉన్నా పక్కనున్న వారి నిర్లక్ష్యం కారణంగా మనకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ప్రమాదం ఎటు వైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని భావించి వాటిని ఆశ్రయించే వారికి కూడా ఇలాంటి ప్రమాదాలు తప్పడంలేదు. అతి వేగం కారణంగా జరిగిన ఈ ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. రహదారిపై వేగంగా దూసుకొచ్చిన మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు ముందున్న వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగడంతో ఇద్దరు చనిపోయారు.
Read Also: Raviteja: ఫ్యాన్స్ గెట్ రెడీ.. వాల్తేరు వీరయ్య తమ్ముడు ఎంట్రీ షురూ
పుణె జిల్లాలోని రాజ్‌గురునగర్ నుంచి నాసిక్‌కు ఎంఎస్ఆర్టీసీకి చెందిన బస్సు వెళ్తుండగా.. పాల్సే గ్రామం సమీపంలోకి రాగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పి నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు ఎస్యూవీ వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా వెళ్లి ముందున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. రెండు బస్సుల మధ్య రెండు బైకులు చిక్కుకుని మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
CCTV footage of ST bus accident at Palase on Nashik-Pune highway#Accident #CCTV #Nashik_pune_Highway#Nashik #Sinnar #Palse pic.twitter.com/9BaKJ0JMUo
— पाटील 🤗 (@PareshPatil11) December 8, 2022