Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nasha Mukt Bharat: యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు సినీ, రాజకీయ రంగాలు ఏకమవుతున్నాయి. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ (హైదరాబాద్ వాక్)కు ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించగా, ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించారు.
సమాజాన్ని, ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం మనందరి సామాజిక బాధ్యతని వెంకటేష్ అన్నారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్” పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ యాత్రను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో యువత, తల్లిదండ్రులు, నగర ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
- Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
- Chittoor Municipal Corporation: చిత్తూరు కార్పొరేషన్లో ట్విస్ట్.. ప్రమాణ స్వీకారానికి ముందే వైసీపీ కార్పొరేటర్ రాజీనామా
- Kaviya Maran: తన ఉద్యోగులకు ఆరెంజ్ ఆర్మీ క్వీన్ సర్ప్రైజ్ గిఫ్ట్.. పెళ్లి కానుక బాక్స్ వీడియోలు వైరల్..
తాజావార్తలు
-
Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Rohingya Genocide: రోహింగ్యాలను కావాలనే చంపారు..తేల్చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం!
ట్రెండింగ్
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!