టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… ఒకవైపు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ.. మరోవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గతంలో వచ్చిన దసరా, హాయ్ నాన్న సక్సెస్‌లతో దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల, బలగం వేణులతో సినిమాలను కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.. ఇక తాజాగా నాని లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
వైరల్ అవుతున్న ఫోటోలలో నాని స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఆ లుక్ లో చాలా అందంగా ఉన్నాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. సమ్మర్ కు చిల్ అవుతున్నట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా ఆ ఫోటోలు మాత్రం ట్రెండ్ అవుతున్నాయి.. ఇక నాని సినిమాల లైనప్ మాములుగా లేదు..
నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ తో ఓ సినిమా చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. నాని ఎప్పుడు కొత్త ప్రయోగాలను చేస్తుంటాడు.. కొత్త దర్శకులకు ఛాన్స్ లను కూడా ఇస్తుంటాడు.. శ్రీకాంత్ ఓదెలతో దసరా చేసి దర్శకుడిగా అతడ్ని నిలబెట్టాడు. ఇప్పుడు తమిళంలోనూ క్రేజ్ ను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..