Leopard: నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఎర్రమల కొండల్లోని అదానీ పెన్నా సిమెంట్ మైనింగ్ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. సిమెంట్ పరిశ్రమలో విధులు ముగించుకొని కారులో వస్తున్న ఉద్యోగి కంటపడింది. కారు నిలిపి చిరుతను వీడియో చిత్రీకరిస్తూ దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది అంటూ సిమెంట్ కంపెనీ ఉద్యోగి చెబుతున్నాడు. కారు లైట్ల వెలుతురుతో వీడియో చిత్రీకరిస్తుండగా చిరుత పొదల్లోకి వెళ్ళిపోయింది. గత ఆరు నెలల క్రితం కూడా తిమ్మనాయుడు పేట చెరువు సమీపంలో చిరుత సంచరించినట్లు సమాచారం.
Read Also: Bhu Bharati: భూ భారతి రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపులో అక్రమాలు.. ఒక్కరోజే రూ.8 లక్షలు గల్లంతు
ఇక, చిరుత పులి జాడ గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గుండం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో చిరుత సంచరించే ప్రాంతంలోనే ఉండడంతో భక్తులు కూడా భయాందోళన చెందుతున్నారు. కోరుమాను పల్లె, అబ్దుల్లాపురం ఉమ్మాయి పల్లె, ఊరు చింతల, తలారి చెరువు తిమ్మనాయుడుపేట గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. ఇక, చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లోనే ఎన్టీపీసీ, సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి.