భూ భారతి పోర్టల్‌ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్న వైనం జనగాం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భూ భారతి స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ జనరేషన్ వరకు ఉన్న సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని రైతుల నుంచి పూర్తిస్థాయిలో డబ్బులు తీసుకుని ప్రభుత్వానికి నామమాత్రంగానే జమ చేస్తూ ఖజానాను కొల్లగొట్టినట్లు సమాచారం. సొమ్ములో కొంత మొత్తమే ప్రభుత్వ ఖజానాలోకి.. మిగతాదంతా సొంత ఖాతలోకే వెళ్తున్నట్లు అనుమానాలు. రూ.9 వేలకు రశీదు ఇచ్చినా.. ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యేది మాత్రం. రూ. 900 లే అని టాక్ వినిపిస్తోంది.
Also Read:OPPO Reno 15 Price: 200MP కెమెరా, 6,500mAh బ్యాటరీ.. మతిపోయే ఫీచర్లతో ఒప్పో రెనో 15 లాంచ్!
మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో మాయాజాలం.. ఒక్కరోజే 8 లక్షలు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు జనగామ జిల్లాలోనే ఇలాంటి 22 కేసులు బయటపడగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ కుంభకోణం కొనసాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి జరుగుతున్న తంతు వెనుక ఓ ముఠా ఉందని, హైదరాబాద్‌కు చెందిన ఓ కీలక వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.