Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- నందిగ్రామ్ ఉప ఎన్నికకు TMC అభ్యర్థిగా సంచిత ప్రధాన్ డే ఎంపిక..
- ఉద్యోగం కోల్పోయిన టీచర్‌ను బరిలోకి దింపిన మమతా బెనర్జీ..
- పోటీకి దూరంగా ఉన్న తృణమూల్ అధినేత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigram Bypoll: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు మమతా బెనర్జీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. నందిగ్రామ్ అసెంబ్ల ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ.. తృణమూల్ కాంగ్రెస్ నందిగ్రామ్ ఉప ఎన్నిక అభ్యర్థిగా సంచిత ప్రధాన్ డేను ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి మమతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీలో లేకుండా పోయారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తృణమూల్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి అంతర్గత పోరు పెరిగింది. దీంతో ఆమె పార్టీపై పట్టు నిలుపుకునేందుకు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అంతా అనుకున్నారు.
అయితే, ఆదివారం మమతా బెనర్జీ తన వర్గానికి చెందిన అభ్యర్థిగా సంచిత ప్రధాన్ డేను ప్రకటించారు. రీజి నగర్ నియోజవర్గ అభ్యర్థిగా ఆలం చౌధురిని ప్రకటించారు. సంచిత నందిగ్రామ్ బోయల్ ప్రైమరీ స్కూట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన వివాదం కారణగా ఆమె ఓ దశలో ఉద్యోగాన్ని కోల్పోయారు. టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేసిన నేపథ్యంలో సంచిత కూడా ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉన్నారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమెకు తిరిగి ఉద్యోగం లభించింది.
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
2008 నుంచి టీఎంసీతో అనుబంధం ఉన్న సంచిత, 2018-23 మధ్య పంచాయతీ సమితి సభ్యురాలిగా పనిచేనశారు. ఉద్యోగం కోల్పోయిన ఒక మాజీ ఉద్యోగిగా ఇప్పుడు ఆమె నందిగ్రామ్ పోరులో నిలుస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. భవానీపూర్‌లో మమతను ఓడించారు. మరోవైపు నందిగ్రామ్‌లో కూడా గెలిచారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌కు రాజీనామా చేసి, భవానీపూర్ ఎమ్మెల్యేగా కొనసాగిందుకు నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు నందిగ్రామ్ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!