Site icon NTV Telugu

N. Mohanakrishna: మనవడి కోసం ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు!

Nandamuri Mohanakrishna

Nandamuri Mohanakrishna

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్‌.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.

READ MORE: Droupadi murmu: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, నందమూరి మోహన కృష్ణ గతంలో కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. 2000 సంవత్సరంలో చివరిగా బాలకృష్ణతో ఓ సినిమా చేసి ఆపేశారు. ఇప్పటి నుంచి ఇక మీదట కెమెరా ముట్టుకోనని ఒట్టు వేసుకున్నారు. అయితే నిన్న జరిగిన జానకిరామ్ కుమారుడు సినిమా లాంచ్‌లో ఫస్ట్ షాట్ కి గౌరవ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. మనవడి కోసం ఆయన పాతికేళ్ల ఒట్టు తీసి గట్టుమీద పెట్టడం గమనార్హం. మరోవైపు.. నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేస్తుండటంతో అభిమానులు ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

READ MORE: Raghurama Krishnam Raju: రఘురామకృష్ణంరాజు షాకింగ్‌ కామెంట్స్‌.. రేపు ప్రతీకార దినోత్సవం..!

Exit mobile version