Raghurama Krishnam Raju: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం జరుపుతున్నట్టు ప్రకటించారు.. 2021 మే 14వ తేదీన నాపై రాజద్రోహం కేసు పెట్టి నన్ను తీసుకెళ్లి ఏం చేసారో అందరికీ తెలుసు.. అదే వాళ్ల చావుకు వచ్చిందన్నారు.. నా రచ్చబండ ద్వారా వాళ్లు ఎంత పనికిమాలిన వాళ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు.. అందుకే ప్రజలు కక్షతో ఓడించారనా పేర్కొన్నారు.. రేపు నా పుట్టినరోజు, నన్ను కొట్టిన తర్వాత ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజు.. అందుకే, రేపు ప్రతీకార దినోత్సవాన్ని స్థానిక రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ జరుపుతున్నాం అని ప్రకటించారు.. ఇక, అందరూ ఈ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలి అంటూ ఆహ్వానించారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు..
Read Also: PM Modi Warns Pak: మన డ్రోన్లు, మిస్సైల్స్ పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయి..