నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.