Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోగా దూసుకుపోతున్నారు. వరుస హిట్లతో ఊపు మీదున్న ఆయన వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తుంటారు. కానీ బాలయ్య మాత్రం రూటు మార్చి ఒకేసారి రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే బాలయ్య మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెసేజ్ ప్లస్ మాస్ సినిమాల స్పెషలిస్ట్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. మే 1న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో ‘దేవర 2’ షూటింగ్‌కు గ్యాప్ ఉండటంతో, ఆ సమయంలోపు బాలయ్య సినిమాను పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. వేసవి ముగిసిన వెంటనే బాలయ్య అటు గోపీచంద్ మలినేని చిత్రాన్ని ఇటు కొరటాల శివ చిత్రాన్ని ఒకేసారి సమాంతరంగా షూట్ చేయబోతున్నారు. అంటే ఒక షెడ్యూల్ ఒక దర్శకుడితో మరో షెడ్యూల్ ఇంకో దర్శకుడితో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒక దానిని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ వార్తతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు
Also Read
- Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
- Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ - శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
- Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్‌లు రద్దు!
- Chiru - Raviteja : చిరు - రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
తాజావార్తలు
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
-
Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
-
Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!