Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఒక సినిమా విజయంలో టైటిల్ పాత్ర చాలా కీలకం. మాస్ హీరోల సినిమాలకైతే ఆ పేరులోనే ఒక ‘వైబ్’ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ సినిమాల గురించి వినిపిస్తున్న టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పేర్లు విన్న అభిమానులు మాత్రం “మాకొద్దు బాబోయ్..” అంటూ తలలు పట్టుకుంటున్నారు.
బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి క్లాసిక్ సినిమాల్లోని పాత్రల ఛాయలు ఉండేలా ఈ పేరు అనుకుంటున్నారట. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇమేజ్‌కు ఈ పేరు ఏమాత్రం సెట్ అవ్వదని ఏదైనా పవర్ఫుల్ టైటిల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
- IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
- Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
- Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
మరోవైపు మాస్ మహారాజా రవితేజ యువ దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు ‘అక్కాయిలు బాగున్నారా’ అనే వెరైటీ టైటిల్ ప్రచారంలో ఉంది. హసిత్ గోలి గతంలో ‘రాజా రాజ చోర’ వంటి వైవిధ్యమైన టైటిల్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే రవితేజ మార్కు మాస్ ఎనర్జీని కోరుకునే ఫ్యాన్స్‌కు ఈ టైటిల్ అస్సలు మింగుడు పడటం లేదు. ఇది మరీ సాఫ్ట్‌గా ఉందని కమర్షియల్ సినిమాకు ఇలాంటి పేరు పెడితే ఆ ఇంపాక్ట్ తగ్గుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం రూమర్స్ గానే బయటకు వచ్చిన ఈ టైటిల్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. “సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా, టైటిల్ వినగానే రోమాలు నిక్కబొడుచుకోవాలి.. కానీ ఇవేం పేర్లు?” అంటూ ఒక అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరి అభిమానుల నుంచి వస్తున్న ఈ వ్యతిరేకతను చూసి చిత్ర యూనిట్లు తమ నిర్ణయాన్ని మార్చుకుంటాయో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!