Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ
- నలుగురు మృతి.. పలువురికి గాయాలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జకార్తా సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు చనిపోగా.. పదుల కొద్ది గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సహాయ బృందం సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read
- Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
- Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
- Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
- Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బెకాసి తిమూర్ రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అదే ట్రాక్‌పైకి మరొక రైలు వచ్చేసింది. దీంతో బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. కొందరు భయంతో కేకలు వేస్తూ కిందకు దూకేశారు. వెనుక నుంచి బలంగా రైలు ఢీకొట్టడంతో చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందాలు.. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం నలుగురు మృతదేహాలను బయటకు తీయగా.. డజన్ల కొద్దీ గాయపడడంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, సరైన నిర్వాహణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇండోనేషియాలో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2024 జనవరిలో వెస్ట్ జావాలో జరిగిన ప్రమాదంలో నలుగురు సిబ్బంది మృతి చెందగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు. అలాగే 2015లో జకార్తాలో రైలు-మినీబస్ ఢీకొన్న ఘటనలో 16 మంది మరణించారు.
इंडोनेशिया में भीषण ट्रेन हादसा
इंडोनेशिया की राजधानी जकार्ता में देर रात एक बड़ा रेल हादसा हुआ, जिसमें एक ट्रेन दूसरी ट्रेन से टकरा गई. इस भीषण दुर्घटना में कम से कम 7 लोगों की मौत हो गई, जबकि कई यात्री गंभीर रूप से घायल हो गए. लोगों को बचाने के लिए राहत एवं बचाव कार्य जारी… pic.twitter.com/TEROl7Ffy2
— NDTV India (@ndtvindia) April 28, 2026
తాజావార్తలు
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!