Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్‌లు రద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఇంధన కొరత ఇప్పుడు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా డీజిల్ కొరత కారణంగా సోమవారం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పలువురు స్టార్ హీరోల చిత్రాల షూటింగ్‌లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల అధిక ధరలకు డీజిల్ కొనుగోలు చేసి పనులు కొనసాగిస్తున్నారు.
సాధారణంగా ఒక సినిమా షూటింగ్ జరగాలంటే భారీ జనరేటర్ల అవసరం ఉంటుంది. లైట్లు, హై-ఎండ్ కెమెరాలు, ఎడిటింగ్ యూనిట్లు, ఈ వేసవిలో నటీనటుల క్యారవాన్లలో ఏసీలు నడవాలంటే గంటకు వందల లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది.దీంతో డీజిల్ లభ్యం కాకపోవడంతో సోమవారం కొన్ని కీలక షెడ్యూల్స్ రద్దయ్యాయి. దీనివల్ల నిర్మాతలకు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. అంతే కాదు స్టాక్ లేదంటూ బంకులు బోర్డులు పెట్టడంతో, చేసేది లేక కొందరు నిర్మాతలు బ్లాక్ మార్కెట్‌లో లీటరుకు అదనపు ధర చెల్లించి డీజిల్ సేకరిస్తున్నారు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
స్టాక్ సరఫరాలో జాప్యం కారణంగా మంగళవారం (ఈరోజు) కూడా పలు షూటింగ్‌లు వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ జూన్, జూలైలో విడుదల కావాల్సిన సినిమాలు ఇప్పుడు ఈ అంతరాయం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వెనుకబడే ప్రమాదం ఉంది. ఒక్కరోజు షూటింగ్ ఆగిపోయినా కాల్ షీట్లు మారడం, లొకేషన్ అద్దెలు పెరగడం వంటి సమస్యలతో నిర్మాతలు సతమతమవుతున్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!