మా పార్టీ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు రావాలని ఆదేశించడం కక్ష సాధింపు అన్నారు ఎంపీ నామ నాగేశ్వరరావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా బలపడకుండా అడ్డుకునేందుకే అడ్డదారి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థలను అడ్డగోలుగా విపక్షాలపై దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కేందుకు ఈడీ, సీబీఐలను ఎంచుకుందని ఆయన మండిపడ్డారు. ఇదే ఈడీ, సీబీఐలు ఏదో ఒక రోజు అధికార బీజేపీ నాయకుల మెడకు చుట్టుకోవడం ఖాయమని ఆయన అన్నారు.
Also Read : Car Falls Into Gorge: లోయలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. మరో ఘటనలో ఐదుగురు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆదానీ వ్యవహారంపై నిగ్గదీసినా ఏమాత్రం సమాధానం చెప్పని కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థలు ఎందుకు విచారణ చేయడం లేదు..!? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉండే, జాతీయ దర్యాప్తు సంస్థలను ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయటం ప్రజాస్వామ్యానికి చేటు అని ఆయన అన్నారు. అధికార బీజేపీకి గుణపాఠం నేర్పేందుకు, దేశ ప్రజలంతా సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
Also Read : Khushboo Sunder: నా తండ్రి నీచుడు.. అందుకే సిగ్గులేకుండా చెప్పా