సీనియర్ హీరో నాగార్జునకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లభించలేదు. నాగార్జున భారీ బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.గతేడాది నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా భారీ అంచనాలతో విడుదల అయ్యి మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా కోసం నాగార్జున ఎంతగానో కష్ట పడ్డారు. కానీ సినిమా ఫలితం చూసి నిరాశ చెందారు.నాగార్జున తన సినిమా కెరీర్ లో ఎందరో కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలను అందిస్తూ వచ్చారు.అలాంటి నాగార్జున కు వరుస ఫ్లాపులు రావడంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున ఫ్యాన్స్ అదిరిపోయే కంబ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తన తోటి సీనియర్ హీరోలు అయిన బాలయ్య, చిరంజీవి వంటి వారు తమ సినిమాలతో అద్భుతంగా రానిస్తున్నారు. దీనితో నాగార్జున కూడా అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయ్యారు.
ఈ క్రమంలో ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆ సినిమాకు గలాటా అనే క్రేజీ టైటిల్ పెట్టినట్లు సమాచారం.అయితే ఆ కథ మలయాళంలో సూపర్ హిట్టయిన పోరింజు మరియం జోస్ ఆధారంగా రూపొందింది అని సమాచారం.తెలుగు నెటివిటీకి తగ్గట్లు రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ భారీ మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.. ఇక రీసెంట్ గా ఈ సినిమా ఫైనల్ నెరేషన్ విన్న నాగార్జున ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది.. ఈ సినిమాకు మొదట ప్రసన్న కుమార్ నే దర్శకుడుగా అనుకున్నా కానీ తర్వాత వేరే దర్శకుడుతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ మధ్య నుంచి మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అంతేకాకుండా సినిమా షూటింగ్ కు వారం రోజుల ముందు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా నాగార్జున కెరీర్ లో 99వ మూవీగా తెరకెక్కుతుంది.. మరి ఈ సినిమాతో నాగార్జున అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.