స్టైలిష్ లుక్, ADAS లెవెల్ 2 ఫీచర్, అబ్బురపరిచే ఫీచర్లతో లాంచ్కు సిద్దమైన Hyundai Venue N..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Venue N: రెండవ తరం వెన్యూ (Venue )ను పరిచయం చేసిన తర్వాత.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు మరింత పనితీరు అందించే ‘ఎన్ లైన్’ (N Line) వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. స్పోర్టి లుక్ లో కనిపించే ఈ ఎస్‌యూవీ నవంబర్ 4న భారతదేశంలో లాంచ్ కానుంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ (GDi) ఇంజిన్ తో వస్తుంది. ఇది 120 హార్స్‌పవర్ (hp) శక్తిని, 172 న్యూటన్ మీటర్ల (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ ట్రెయిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) తో అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ వెర్షన్‌లో ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా ఉన్నాయి.
200MP+50MP+50MP+50MP కెమెరా, 5440mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ సంచలనం Vivo X300 Pro లాంచ్..!
Also Read
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
- New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
స్టాండర్డ్ వెన్యూతో పోలిస్తే.. వెన్యూ ఎన్ లైన్ అనేక డిజైన్ మార్పులను కలిగి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన ముందు, వెనుక బంపర్‌లపై ఎరుపు రంగు యాక్సెంట్‌లు ప్రధానంగా కామపడుతాయి. ఇది 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ రిమ్స్, ఎరుపు బ్రేక్ కాలిపర్‌లు, వింగ్ స్టైల్ స్పాయిలర్, డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వస్తుంది. వెన్యూ ఎన్ లైన్ అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, డ్రాగన్ రెడ్, అబిస్ బ్లాక్, హాజెల్ బ్లూ వంటి ఐదు సాలిడ్ రంగులలో నలుపు రూఫ్‌తో మూడు డ్యూయల్ టోన్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇక క్యాబిన్ లోపల నలుపు రంగు అపోల్స్టరీని ఎరుపు హైలైట్స్ తో డిజైన్ చేశారు. ఇది స్పోర్టియర్ లుక్‌ను ఇస్తుంది. టెక్నాలజీ పరంగా ఎన్విడియా (NVIDIA) తో పనిచేసే 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ నావిగేషన్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల డిజిటల్ గేజ్ క్లస్టర్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. అలాగే, ఈ వాహనంలో 20 వరకు వాహన కంట్రోలర్‌లను ప్రభావితం చేసే ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు పొందే సామర్థ్యం ఉంది. సరౌండ్ వ్యూ మానిటరింగ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటరింగ్ మరియు సువాసన డిఫ్యూజర్ వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి.
JioHotstar: రూ. 1 కే జియో హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్.. ఈ స్పెషల్ ఆఫర్ మీకూ వచ్చిందా?
ఇక ముఖ్యంగా ప్రయాణీకుల భద్రతను పెంచడానికి వెన్యూ ఎన్ లైన్ ADAS లెవెల్ 2 ఫీచర్‌లతో వస్తుంది. ఇందులో 21 డ్రైవర్ అసిస్టెన్స్ ఫంక్షన్లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ ఉన్నాయి. ఈ వాహనంలో 70 కంటే ఎక్కువ అధునాతన భద్రతా ఫీచర్లతో పాటు 41 ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. దీని బుకింగ్ లను కూడా ప్రారంభించింది.కాబట్టి ఆసక్తిగల కొనుగోలుదారులు డీలర్‌షిప్‌ల ద్వారా కేవలం రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

తాజావార్తలు
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..