అనంతపురం కలెక్టరేట్ నుంచి తాడిపత్రి వెళ్ళే చెరువుకట్ట పైన ఉన్న రోడ్డు ను పరిశీలించారు జనసేన నేత నాగబాబు. రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వ పాలన అలానే ఉందన్నారు. జీవో వన్ విషయంలో ప్రభుత్వానికి కోర్టులు మెట్టికాయలు వేశాయని, ప్రభుత్వ ఆంక్షలతో పాదయాత్రలు ఆగవన్నారు. పొత్తుల విషయాలని పార్టీ అధ్యక్షుడు చూసుకుంటారని, గతంలో విశాఖలో పవన్ ఇబ్బంది పెట్టారన్నారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Salaar: రికార్డులు ఉంటే రాసి పెట్టుకోండి… 250 రోజుల్లో అన్నీ లేస్తాయ్…
ధ్వంసమైన చెరువు కట్ట రోడ్డు మరమ్మత్తు శ్రమదానం కోసం నాగబాబు పిలుపు ఇవ్వడంతో… రాత్రికి రాత్రే ధ్వంసమైన చెరువు కట్ట రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ… జనసైనికులు రోడ్డు వేస్తారని వైసీపీ ప్రభుత్వం వెంటనే పనులను మొదలుపెట్టిందన్నారు. వారాహి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు. డెమోక్రసీ లో ఇల్లీగల్, చట్ట వ్యతిరేక పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరైనా.. ఎప్పుడైనా చేయవచ్చునన్నారు నాగబాబు.
Also Read : Thieves in Girls Hostel: గర్ల్స్ హాస్టల్ లో దొంగలు పడ్డారు.. తరువాత ఏం జరిగిందంటే..