నాగశౌర్య.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. అయితే.. నాగశౌర్య తెలుగు తెరకు పరిచయమై దశాబ్దకాలం గడుస్తోంది. 2011లో”క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్” అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగశౌర్య. కానీ.. ఆ తరువాత వచ్చిన ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య సినిమాను తనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక శైలిలో దూసుకుపోతున్న నాగశౌర్య తాజాగా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ నెల 20న బెంగళూర్ లో నాగశౌర్య వివాహం జరుగనుంది. అనూషను నాగ శౌర్య మ్యారేజ్ చేసుకోనున్నారు. అయితే.. 19న మెహందీ ఫంక్షన్ ఉండటంతో.. ఇప్పటికే నాగ శౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది.
Also Read : Avatar The Way Of Water: ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కన్నడ ట్రైలర్ రిలీజ్
ఇదిలా ఉంటే.. నాగశౌర్య ఇటీవలే తన నెక్స్ట్ సినిమాను ‘NS24’ ప్రకటించారు. ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, అరుణ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుడగా.. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెట్రీ పలనిస్వామి ఛాయగ్రాహకుడిగా పనిచేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమాలో నాగశౌర్య గత చిత్రాలకంటే భిన్నంగా కనిపిస్తాడని ఇటీవలే వెల్లడించింది చిత్రబృందం.