అక్కినేని నాగచైతన్య చివరిగా "తండేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది.