Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట పెళ్లి వేడుక తెలుగు సాంప్రదాయం ప్రకారం కనులపండువగా సాగింది. ఈ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా జరిగింది.
ఓ వైపు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూనే మరో వైపు కెరీర్ లో మరొక భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య. చైతు సినీ కెరీర్ లో భారీ హిట్ అంటే మజిలీ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరలేదు. ఆ కోవలోనే విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ దండు తో కలిసి నాగ చైతన్య ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు.…