ఇవాళ అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం టైటిల్ ను ఖరారు చేశారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రంతో తొలిసారి చైతు కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే పేరు పెట్టారు. ఎ. శివ అనే పోలీస్ ఆఫీసర్ గా ఇందులో నాగచైతన్య నటిస్తున్నాడు. అయితే ఇదే సమయంలో ఇవాళ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఫెరోషియస్ గా ముందుకు పోతున్న నాగచైతన్యను పోలీసులందరూ పట్టుకుని ఆపుతున్నారు.
Also Read : Satyendar Jain: జైలులో మంత్రి భోగాలు.. మరో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ
అంతేకాదు… కదిలితే కాల్చేస్తామన్నట్టుగా తుపాకులూ గురిపెట్టారు. మరి ఓ పోలీస్ ఆఫీసర్ కు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురయ్యిందనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే! మాస్ కు కావాల్సినంత యాక్షన్ సీన్స్ ఇందులో ఉంటాయని దర్శకుడు వెంకట్ ప్రభు ఈ పోస్టర్ తో చెప్పకనే చెప్పేశాడు. అరవింద స్వామి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కృతీశెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్జీ, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ తో పాటు ‘కార్తీక దీపం’ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.