ఇస్మార్ట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్.. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు కానీ యూత్ ను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీగా అయ్యింది. తాజాగా ఈ అమ్మడుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ అమ్మడు నిఖిల్ స్వయంభు, ప్రియదర్శితో డార్లింగ్ అంటూ పలు ప్రాజెక్టులతో నభా నటేష్ బిజీగా మారిపోయింది. కరోనా కంటే ముందు నభా మంచి స్పీడు మీద ఉండేది. సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ అంటూ ఇలా వరుస చిత్రాలతో సందడి చేసింది.. ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి క్రేజ్ ను అందించింది..అయితే కరోనా టైం లో జరిగిన ప్రమాదం వల్ల ఇంటికే పరిమితం అయ్యింది.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీగా మారింది..
ఇదిలా ఉండగా.. ఈ అమ్మడుకు జరిగిన ప్రమాదంలో భుజం, మోచేతికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఆ గాయం గుర్తులు అలానే ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ రీల్‌ని చూస్తేనే ఈ విషయం పై క్లారిటీ వస్తుంది.. ఆ గాయాలు మానలేదని తెలుస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..