నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి లో బాలిక ఘటనలో సస్పెన్స్ వీడటం లేదు. ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 7వ రోజు గాలింపు కొనసాగతోంది. 7వ తేదీన బాలిక(9) అదృశ్యమైంది. పోలీసుల అదుపులో మైనర్ బాలులు, తల్లిదండ్రులు ఉన్నారు. అయితే.. నాలుగు రోజుల క్రితం కాలువలో మృతదేహాన్ని పడేశామన్న మైనర్ బాలురు. రెండు రోజుల క్రితమేమో గ్రామ సమీపంలోని స్మశానంలో పడేశామని తెలిపారు. తాజాగా బాలిక మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశామని మైనర్ బాలుని తండ్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కృష్ణా నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. పూటకో మాట చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు మైనర్ బాలురు. డీఐజీ స్థాయి అధికారి కేసును పర్యవేక్షించినా బాలిక (9) మృతదేహం ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కనీసం బాలిక మృతదేహం అయిన అప్పజెప్పాలని బాలిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. నంద్యాలలో నేడు పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో బాలిక(9) ఘటనను నిరసిస్తూ చలో ముచ్చుమర్రి కి పిలుపునిచ్చారు నంద్యాల వీఆర్పీఎస్ నాయకులు. నంద్యాల నుంచి ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్న వీఆర్పీఎస్ శ్రేణులు.. నిందితుల నుంచి మృతదేహం ఆచూకీ తొందరగా రాబట్టాలని డిమాండ్ చేస్తున్నారు.