Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము
- దేశ భవిష్యత్‌ను నిర్మించేవారు విద్యార్థులే
- పరీక్షా విధానంలో సంస్కరణలు రాబోతున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థుల ఆందోళనలపై తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విద్యార్థుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్‌ను నిర్మించేవారు విద్యార్థులేనని.. యువతను రక్షించడంతో పాటు వారికి న్యాయమైన, సురక్షితమైన పరీక్షా వ్యవస్థ అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పరీక్షా విధానంలో సంస్కరణలు రాబోతున్నట్లుగా తెలిపారు.
‘‘మన విద్యార్థులే భారత భవిష్యత్తును నిర్మించేవారు. జాతీయ భద్రత కోసం ప్రభుత్వం, సమాజం ఐక్యంగా ఉండటం ఎంత అవసరమో.. విద్యార్థుల వర్తమానం, భవిష్యత్తును కాపాడేందుకు కూడా అందరూ సమష్టిగా కృషి చేయడం అంతే అవసరం’’ అని అన్నారు. ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. ముఖ్యంగా పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులు, మోసాలను అరికట్టడం, పరీక్షల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
Also Read
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
- Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
- Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
ఇటీవల పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన అంశాలపై విద్యార్థుల నుంచి ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వం, సమాజం ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసిన ముర్ము.. యువతకు నమ్మకమైన పరీక్షా వాతావరణాన్ని కల్పించేందుకు సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు.
నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక లీకేజీలు అరికట్టేందుకు కేంద్రం కఠినమైన బిల్లును కూడా తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
-
Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!