ఈమధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇటీవల ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో చాలా బిజిబిజీగా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ఓ ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మర్డర్ ముబారక్. ఈ సిరీస్ లో హీరోయిన్ సారాతో పాటు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, డింపుల్ కపాడియా, పంకజ్ త్రిపాఠి, సుహైల్ నయ్యర్, తారా అలీషా బెర్నీ, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా మొదలగు తారాగణం ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
also read: Cucumber Benefits : వేసవిలో కీరాను ఎందుకు తినాలో తెలుసా?
ముందుగా విడుదలైన టీజర్స్, ట్రైలర్ లోనే ఆసక్తిని రేకెత్తించిన వెబ్ సిరీస్ మర్డర్ ముబారక్ డైరెక్టుగా ఓటీటీ లోనే రిలీజైంది. శుక్రవారం అర్ధరాత్రి నుండే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ మర్డర్ ముబారక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
also read: Komatireddy Venkat Reddy: తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం..
డోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ ఈ సినిమాను నిర్మించగా.. అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యూ టు డెత్ నవల ఆధారంగా మర్డర్ ముబారక్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇక వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. ధనవంతులు మెంబర్స్ గా నడుస్తున్న ది రాయల్ ఢిల్లీ క్లబ్ లో అనుకోకుండా ఒక హత్య జరుగుతుంది. ఇక హత్య వెనుక ఉన్న కారణాలు, మర్డర్ ఎవరు చేశారన్న అనే మిస్టరీని ఛేదించేందుకు భవానీ సింగ్ గా నడిచిన పంకజ్ త్రిపాఠి రంగంలోకి దిగుతాడు. ఆపై అతను ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు..? అలాగే ఈ మర్డర్ మిస్టరీ వెనక ఎవరి హస్తం ఉందొ..? అనేది తెలుసుకోవాలంటే మర్డర్ ముబారక్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ మూవీ ఓ మంచి సెలెక్షన్.
Mubarak ho- this mystery is now yours to solve! 👀🔎
Watch Murder Mubarak, now streaming, only on Netflix! pic.twitter.com/ZrN92A6axk— Netflix India (@NetflixIndia) March 15, 2024