కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌లా దూసుకుపోతోందన్నారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్… ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియా కెం 2022 సదస్సు జరిగింది.. ఈ సదస్సుకు హాజరైన మంత్రి అమర్నాథ్.. కేంద్రం మంత్రి మన్సుఖ్ మాండవియాకు శాలువా కప్పి సత్కరించారు.. ఇక, ఆయన సదస్సులో మాట్లాడుతూ.. కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో ఏపీ దూసుకుపోతుందని వెల్లడించారు.. 974 కిలోమీటర్ల సముద్ర తీరంతో దేశానికి ఏపీ ఈస్ట్రన్ గేట్వే ఆఫ్ ఇండియాగా మారిందన్న ఆయన.. పోర్టు ఆధారిత అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ మా వద్ద ఉంది.. పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు..
Read Also: Koti Deepotsavam LIVE: మూడోరోజు కోటి దీపోత్సవం.. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం
ఇక, గడచిన మూడేళ్లలో రూ.46,280 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చాయని తెలిపారు మంత్రి అమర్నాథ్.. వీటి ద్వారా 70,606 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్న ఆయన.. 35,181 చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో 2,11,374 ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు.. కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, పరిశ్రమలశాఖ బాధ్యతలు తీసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ విదేశాల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే.