Mumbai Ice Cream Case: ముంబయికి చెందిన యువ డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో తన సోదరితో కలిసి బుధవారం ఆన్లైన్ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్ పెట్టారు. వారు కొనుగోలు చేసిన ‘ది యుమ్మో బటర్‌స్కాచ్’ ఫ్లేవర్ కోన్ ఐస్‌క్రీమ్‌లను సదరు సంస్థ డెలివరీ చేసింది. అయితే, ఆ ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేశారు.. నాలుకకు ఏదో గట్టిగా తగిలింది.. దీంతో డౌట్ వచ్చి దానిని పరీక్షించి చూడగా.. 2 అంగుళాల మనిషి వేలు కనిపించింది. దీంతో ఆమె స్వయంగా డాక్టర్ కావడంతో వెంటనే దానిని పరిశీలించింది.
Read Also: Virat Kohli: ఐపీఎల్లో రెచ్చిపోయాడు.. ప్రపంచకప్‌లో తేలిపోయాడు! కోహ్లీకి ఏమైంది?
ఇక, ఈ ఘటనపై వెంటనే మలాడ్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని.. దీనిపై మాట్లాడుతూ.. ఆ వేలును ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు. ఆ ఐస్‌క్రీం తయారు చేసిన సంస్థ ప్రాంగణంలో కూడా తనిఖీలు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆ ఐస్‌క్రీమ్ తయారీ సంస్థ ఇప్పటి వరకు ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు.