సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కొందరు వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో కొన్ని వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా మెట్రోలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు మెట్రోలో ప్రయాణం చెయ్యడానికి టికెట్ కొంటాడు.. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. అవును ఉంది.. ట్రాఫిక్ వల్లో తెలియదు.. సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో తెలియదు కానీ ఆ కుర్రాడు తనతో పాటుగా సైకిల్ ను కూడా మెట్రోలో తీసుకెళ్లాడు.. మాములుగా ట్రాఫిక్ ఉన్న హెల్త్ కు మంచిదని సైకిల్ మీద వెళ్తారు.. కానీ ఇతడు ఇలా చెయ్యడం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది..
తాజాగా ముంబై మెట్రో ట్రైనులో ఓ యువకుడు తన సైకిల్ ను మెట్రో ట్రైనులో తీసుకెళ్లి, వీడియో తీసుకున్నాడు. హర్షిత్ అనురాగ్ అనే యువకుడు మెట్రో స్టేషన్‌కు వెళ్లి తన కోసం టికెట్ కొనుక్కున్నాడు. అనంతరం సైకిల్‌ను పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కాడు. ప్లాట్ ఫాంపై నిలబడి ట్రైను కోసం వేచిచూసి కాస్త ఖాళీగా వచ్చిన ట్రైను ఎక్కాడు. సైకిల్ వంటి వాటి కోసం ట్రైనులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాండ్‌లో దాన్ని ఉంచాడు. దాని పక్కనే సీట్లో కూర్చుని ప్రయాణించాడు. తాను దిగాల్సిన స్టేషన్ రాగానే మళ్లీ సైకిల్‌ను తీసుకుని కిందకు దిగాడు..ముంబై వీధుల్లో సైకిల్ తొక్కడం, ఇక్కడి మెట్రోలో ప్రయాణించడం ఓ గొప్ప అనుభవమని హర్షిత్ అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన కొందరు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. మీరు ఒక లుక్ వేసుకోండి..