Father Kills Son: మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు.. కన్న కొడుకునే కడతేర్చాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Kills Son: ప్రస్తుత కాలంలో కొందరు వివాహితులు తాత్కాలిక శారీరక సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారితో పాటు కన్నవారిని కడతేర్చడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసి.. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని వాగులో పడేశాడు. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అతను నేరం చేసిన కొన్ని గంటల అనంతరం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటివరకు జరిపిన విచారణలో.. 22 ఏళ్ల నిందితుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళను వివాహం చేసుకునేందుకే తన కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు కనుక్కున్నారు. ఎందుకంటే తనను పెళ్లి చేసుకోవాలంటే కుమారుడి అడ్డు తొలగించాలని ఆ మహిళ షరతు పెట్టినట్లు విచారణలో తేలింది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే భార్య, కొడుకును అడ్డు లేకుండా చేయాలని ఆ మహిళ నిందితుడికి చెప్పినట్లు ఓ అధికారి చెప్పారు. ఆ రెండేళ్ల బాలుడి మృతదేహాన్ని కేమ్‌కార్ చౌక్ సమీపంలోని మహిమ్ వాగులో కనుగొన్నట్లు షాహు నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ సంచిలో ఉన్న మృతదేహాన్ని ఎలుకలు కొరికినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లాడు కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి బంధువులతో జరిపిన విచారణలో.. అతని తండ్రి ధారవి మురికివాడలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
Read Also: Vijayawada Crime: ప్రేమికులకు నచ్చజెప్పేందుకు వచ్చాడు.. దారుణ హత్యకు గురయ్యాడు..!
“గార్మెంట్ ఫ్యాక్టరీలో టైలర్‌గా పనిచేస్తున్న నిందితుడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.. తనను పెళ్లి చేసుకోవాలంటే తన భార్య, కొడుకును అంతమొందించాలని ఆమె అతడిని కోరిందని, ఆ తర్వాత వారిని చంపేందుకు నిందితులు పథకం పన్నారు. ” అని పోలీసు అధికారి తెలిపారు. చాక్లెట్ ఇస్తానని చెప్పి భార్య దగ్గర నుంచి కొడుకును తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు నిందితుడు. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని మహిమ్ వాగులో పడేశాడు. నిందితుడిని ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 362 (అపహరణ), సంబంధిత ఇతర సెక్షన్ల ప్రకారం అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!