Mukunda Jewellers: బంగారు ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం ఫిబ్రవరి 14న పేట్ బషీరాబాద్, సుచిత్రలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ చేతుల మీదుగా ముకుంద జ్యువెల్లర్స్ షోరూం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి జీడిమెట్ల కార్పొరేటర్ సి. తారా చంద్ర రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ. హనుమకొండలలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న ‘ముకుంద జ్యువెల్లర్స్’.. తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభిస్తోంది. తక్కువ ఖర్చు ఎక్కువ పొదుపుతో ఆభరణాలను కొనుగోలు చేసేలా అద్భుతమైన ఆఫర్లను అందిచడానికి సిద్ధమైంది ‘ముకుంద జ్యువెల్లర్స్’.
Read Also: JioHotstar: ఓటీటీ ప్రపంచంలో సత్తా చూపడానికి సిద్దమవుతున్న జియోహాట్‌స్టార్!
ముకుంద జ్యువెలర్స్ తమ స్టోర్‌లో అద్భుతమైన కలెక్షన్లతో పాటు ప్రత్యేకమైన డిజైన్లను అందుబాటులో ఉంచింది. డైమండ్ రింగ్‌లు, నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్‌లు మొదలైన అధిక నాణ్యత గల ఆభరణాలను ఈ స్టోర్ అందిస్తోంది. నగల తయారీకి మేకింగ్ ఛార్జీలు ఉండకపోవడం విశేషం. కానీ, తరుగు చార్జీలు 2 నుంచి 12 శాతం మాత్రమే ఉంటాయని స్టోర్ యాజమాన్యం వెల్లడించింది. ముకుంద జ్యువెలర్స్ సంస్థ తన వినూత్న డిజైన్లతో బ్రాండ్‌ను పెంచుకుంటూ దూసుకెళ్లిపోతుంది. సాంప్రదాయ భారతీయ డిజైన్‌ల నుండి ఆధునిక, సమకాలీన శైలుల వరకు వివిధ రకాల ఆభరణాలను అందిస్తోంది. అదనంగా, ఆకర్షణీయమైన ఆభరణాల ఎంపికతో పాటు, గ్లామర్ జెమ్స్ కస్టమ్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది. వినియోగదారులు తమ కుటుంబ సభ్యులాగా భావించబడతారని, వారికి అధిక నాణ్యత గల ఆభరణాలు అందించడంలో ముందుంటామని స్టోర్ యజమాని తెలిపారు. అలాగే కొన్ని షో రూమ్ ఓపెనింగ్ సందర్బంగా ప్రత్యేక ఆఫర్‌లను కూడా అందించనుంది ముకుంద జ్యువెలర్స్.