YSRCP: వైసీపీ నుంచి బరిలోకి ముద్రగడ కోడలు..! అక్కడి నుంచే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి.. కొందరికి టికెట్లు దక్కడం లేదు.. మరికొందరికి సీట్లు మారిపోతున్నాయి.. ఇక, వైసీపీ రెండో జాబితా విడుదలైన తర్వాత.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబం పేరు తెరపైకి వచ్చింది.. ముద్రగడ చిన్న కోడలు సిరిని తుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపే యోచనలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ముద్రగడ చిన్న కొడుకు గిరిబాబు భార్యనే ఈ సిరి… ఆమె సొంత ఊరు తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం కావడంతో.. సిరిని అదే నియోజకవర్గం నుంచి పోటీకి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
Read Also: Petrol Bunks: హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో కొనసాగుతున్న రద్దీ..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
అయితే, తుని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతరి దాడిశెట్టి రాజాను.. కాకినాడ ఎంపీగా పోటీ చేయించే యోచనలో ఉంది వైసీపీ.. ఈ ప్రపోజల్‌ను ఆయన ముందు పెట్టడంతో.. ఎంపీగా వెళ్లడానికి దాడిశెట్టి ఆసక్తి చూపనట్టు తెలుస్తోంది. కానీ, ఫైనల్‌గా పార్టీ అధిష్టానరం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించారు. తుని నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దాడిశెట్టి రాజా. మార్పులు చేర్పుల్లో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉండగా.. ఇక ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెడితే బాగుంటుంది అని ఆలోచన చేస్తోంది వైసీపీ అధిష్టానం.. దాడిశెట్టి రాజా.. లోక్‌సభ బరిలో దిగుతారా? లేదా అనే విషయాన్ని పక్కనబెడితే.. ఆది నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా ఉంటున్న ముద్రగడ్ పద్మనాభం కుటుంబానికి ఓ సీటు ఇవ్వాలని.. అందులో భాగంగానే ముద్రగడ చిన్న కోడలు సిరిని తుని అసెంబ్లీ నుంచి బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!