Thala For A Reason: 7 వికెట్లు, 7 పరుగులు.. భారత్ విజయంలో ‘7’ సెంటిమెంట్.. ధోని ఫ్యాన్స్ ఫిదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni- India vs England: టీమిండియా మరో టీ20 వరల్డ్ కప్ గెలుచుకునేందుకు అడుగు దూరంలో ఉంది. నిన్న సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. పూర్తి జట్టు సహాయ సహకారాల వల్ల ఇది సాధ్యమైంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ యాదృచ్ఛికమైన ఘటన జరిగింది. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ స్కోర్ 253/7, ఇంగ్లాండ్ స్కోర్ 246/7. ఇక్కడ రెండు టీమ్‌లు వికెట్ల(7) చొప్పున కోల్పోయాయి. భారత్ ఏడు(7) పరుగుల తేడాతో గెలిచింది. మూడింటిలో ఏడు కామన్‌గా ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని జర్సీ నంబర్ కూడా 7 కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ.. అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారం వైరల్‌గా మారింది.
READ MORE: Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా గోర్ లేటెస్ట్ వీడియో!
Also Read
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
- Jofra Archer: "ఇది ఐపీఎల్ కాదు".. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ఐసీసీ ట్రోఫీలు మాత్రమే కాకుండా ఐపీఎల్‌లోనూ మహి అద్భుత ప్రతిభ కనబరిచాడు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇక జర్నీ విషయానికి వస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు, మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ మ్యాచ్‌లలో జెర్సీ నంబర్ 7 ధరించి ఆడుతున్నాడు. అయితే మహి జెర్సీ నంబర్-7 రహస్యం ఏంటో తెలుసా? నిజానికి మహేంద్ర సింగ్ ధోని స్వయంగా తన జెర్సీ నంబర్-7ను వెల్లడించాడు. 7వ నంబర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఎలా ఉందో చెప్పాడు. మహి తాను జూలై 7వ తేదీన పుట్టానని చెప్పాడు. సంవత్సరంలో జూలై 7వ నెల. తాను పుట్టిన సంవత్సరం 81… 8లో నుంచి 1 తీసివేస్తే 7. కాబట్టి ఈ కారణాలన్నింటి వల్ల తాను తన జెర్సీ నంబర్‌గా 7ని ఎంచుకున్నట్లు తెలిపాడు.
Thala For a reason!😅
India defeated England by 7 runs in the T20 World Cup 2026 semi-final at Mumbai's Wankhede Stadium to reach the tournament final for the fourth time.#Thala #INDvENG #SanjuSamson #Bethell #GautamGambhir pic.twitter.com/LGbr79Ivrw— Parmar SSC (@ParmarSSC_X) March 5, 2026
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..