AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు అనగా నవంబర్ 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ఐపీబీ (SIPB) ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్షిప్ సమ్మిట్‌పై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. సదస్సు నిర్వహణ, పెట్టుబడుల ఆకర్షణ, వివిధ శాఖల సమన్వయంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు.. కేబినెట్ అజెండాలోని అంశాలపై చర్చ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ, పార్టీ విజయావకాశాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రులతో చంద్రబాబు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కొంతమంది మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి క్లాస్ తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు సమర్థంగా పనిచేస్తున్న కొందరు మంత్రులను చంద్రబాబు అభినందించే అవకాశం కూడా ఉందని సమాచారం. దీంతో రేపటి కేబినెట్ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరి కేబినెట్ భేటీలో ఎలాంటి చర్చ జరుగుతుంది.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది..
Also Read
- YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
- Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
- Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
- CM Chandrababu: రెబల్స్‌కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
తాజావార్తలు
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
-
Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
-
CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
-
AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
-
Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!