CM Revanth Reddy: ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ..
- ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఖైరతాబాద్ గణసాధునికి చేరుకుని తొలి పూజ..
- రేవంత్‌కి అర్చకులు మంగళ హారతులతో స్వాగతం పలికారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్‌కి పూర్ణకుంభం, మంగళ హారతులతో అర్చకులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహా గణపతి కి గజమాల అందజేశారు. మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు ఉదయం ఒగ్గుడోలు, పద్మశాలీలందరూ బోనాలు ఎత్తుకున్న మహిళలతో ఊరేగింపుగా వచ్చి ఖైరతాబాద్ గణేశుడికి చేనేత దారం కండువా, గాయత్రి సమర్పించారు. గతేడాది 63 అడుగుల ఎత్తులో వినాయకుడిని ప్రతిష్టించగా.. ఈ ఏడాది 70వ వసంతం సందర్భంగా.. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో పెద్ద గణేశుడిని ప్రతిష్ఠించారు.
Read also: Electric shock: పండగపూట విషాదం…కరెంట్ షాక్ తో యువకుడు మృతి
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకుని ఈ నెల 17న ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పూజలో పాల్గొంటారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గణపతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ కు రానున్నారు. వీరి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా నిర్వాహకులు ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. గతేడాది దాదాపు 22 లక్షల మంది భక్తులు బడా గణేష్‌ను దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు వస్తారని ఉత్సవ్ కమిటీ అంచనా వేస్తోంది.
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!