NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రుల విమర్శలు

Rahul

Rahul

Rahul Gandhi: గురువారం నాడు పార్లమెంట్‌లో చోటుచేసుకున్న సంఘటనలో గాయపడ్డ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజపుత్‌లను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బండి సంజయ్ పరామర్శించారు. పార్లమెంట్‌లో జరిగిన తోపులాటలో ఇద్దరు ఎంపీలు గాయపడటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వరుస ఓటముల కారణంగా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగిందని విమర్శించారు.

Also Read: Devendra Fadnavis: భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” పాల్గొన్నారు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు!

అంబేద్కర్‌ పై గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును గుర్తుచేసిన కిషన్ రెడ్డి.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ని అవమానించింది కాంగ్రెస్‌ పార్టీ అని, కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేయించిన వారు కూడా వారే. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరు? కేంద్ర హాల్లో విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నది కూడా వారే అని ఆయన అన్నారు. అంబేద్కర్‌ ని అడుగడుగునా అవమాన పరిచిన చరిత్ర కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల మన్ననలు పొందుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్‌ గారి ఆలోచనలను ప్రధానమంత్రి మోడీ ఫాలో అవుతున్నారు. ఆయన అడిగిన పంచతీర్థాలను అభివృద్ధి చేసి దేశ ప్రజలకు అంకితం చేశారని తెలిపారు.

Also Read: FIR On KTR: కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వండి.. ఏసీబీకి ఈడీ లేఖ

రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ, పార్లమెంట్‌లో టీషర్ట్ వేసుకుని యువకుడిగా కనిపిస్తూ ఎంపీలపై దాడులు చేయడం దారుణం అని అన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో దేశ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాహుల్ గాంధీపై ఈ విమర్శలు, పార్లమెంట్‌లో చోటుచేసుకున్న ఘటన రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.