టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా.. ‘అయ్యో పాపం! ఎన్ని లాబీయింగులు చేసినా ఎన్డీయే కూటమి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం రాలేదు. బిజెపిలోకి పంపించిన కోవర్టులు శతవిధాలా ప్రయత్నించి భంగపడ్డారు. తాను ఏ గట్టున ఉన్నాడో తెలియని పరిస్థితిలో కుమిలిపోతున్నాడు బాబుగారు. అవకాశవాద రాజకీయాలకు ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదు.’ అంటూ ట్విట్టస్రాలు చేశారు.
Also Read : Siddipet Crime: సిద్దిపేటలో దారుణం… భార్యని చంపి భర్త పరార్
అంతేకాకుండా.. ‘జగన్ గారి నాలుగేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నిధులు పక్కదోవ పట్టిన ఉదంతం లేదు. రైతులు ఎన్నడూ లేనంత ధీమాగా, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, ఆసరాలేని వారంతా ఇటువంటి సిఎం ఎప్పటికీ ఉండాలని గుండె నిబ్బరంతో ఉన్నారు. ‘స్పేస్’ లేకున్నా ఏదో ఒకటి కెలకాలనే టీడీపీ వారు వీధుల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రతిపక్షం ప్రజల కోసం, ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఉద్యమిస్తాయి. నిబద్ధతతో నిలబడే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారు. ఆంధ్ర టీడీపీలో మాత్రం విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక విఫలనేత కోసం అంతా పోగవుతారు. ఆయన ఊ అనగానే ఉత్తుత్తి ఉద్యమాలు, హాస్యాస్పద ప్రదర్శనలు జరుగుతుంటాయి.’ అంటూ ట్వీట్స్ చేశారు.
Also Read : Telangana: వరంగల్‌లో వీరంగం సృష్టించిన సైకో..ఇంట్లో చొరబడి రాళ్లతో దాడి..