Site icon NTV Telugu

MP Ranjith Reddy : తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు

Mp Ranjith Reddy

Mp Ranjith Reddy

లోక్ సభ సాక్షిగా నిన్న అమిత్ షా అబద్ధాలు మాట్లాడారని విమర్శలు గుప్పించారు బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను బలోపేతం చేసింది, రైతులకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూర్చింది కేసీఆర్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదని, 86వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇచ్చామని బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే అబద్ధాలు చెప్పాడన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు కూడా జాతీయ హోదా కేంద్రం ఇవ్వలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చారని ఆయన మండిపడ్డారు. రైతులను బలోపేతం చేస్తా అన్నారని.. రైతులకు అండగా నిలిచింది కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. ఇంటింటికి నీరు ఇచ్చింది కేసీఆర్ అని అన్నారు.

Also Read : Emergency Landing: హిమాచల్‌ సీఎంకు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

పార్లమెంట్‌కు నిశికాంత్ దూబే తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ నోటీసు ఇచ్చామన్నారు ఎంపీ రంజిత్‌ రెడ్డి. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, రేవంత్ రెడ్డి నువ్వెంత ? నీ హైట్ ఎంత ? అంటూ రంజిత్‌ రెడ్డి సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. కేసీఆర్‌కు పిండం పెడతా అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ అని రేవంత్ రెడ్డి అర్ధంపర్ధం లేని విధంగా మాట్లాడుతున్నాడంటూ రంజిత్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

Also Read : Bhola Shankar: భోళాశంకర్ టికెట్ రేట్ల పెంపు వివాదం ఏంటి? ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?

Exit mobile version